ఏపీ ప్రజలకు చల్లని కబురు అందింది. రాష్ట్రంలో భగభగలతో ఎండలు మండిపోతున్న వేళ రుతపవనాలు వారం ముందుగానే ఆగ్నేయ బంగాళాఖాతానికి వస్తున్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 40-42 డిగ్రీలుగా నమోదయ్యేఅవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. శనివారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్..
