ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్‌కు గొప్ప విజయం లభించింది. ఆపరేషన్ సింధూర్‌లో కీలక ఉగ్రవాద నేతలు హతం అయ్యారు. ఉగ్రవాదులను అంతం చేయడానికే ఈ దాడులు చేశామన్న భారత్. తిరుగులేని ఆధారాలను వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ మే 7న జరిగిన ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో కీలకమైన 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగాయి. పాకిస్తాన్, పీఓకే భూభాగంలోని కీలకమైన మురిడ్కే, బహవల్పూర్, సియాల్కోట్, చకంబ్రూ, కోట్లీ, గుల్పూర్, భీంబర్ ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అయితే.. ఈ దాడుల్లో టాప్ టెర్రరిస్టులు హతమయ్యారు. కరుడుగట్టిన ఐదుగురు ఉగ్రవాదులు మరణించినట్టు శనివారం ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. మరణించినవారిలో ముగ్గురు జైషే మహ్మద్ ఇద్దరు లష్కరే టెర్రరిస్టులుగా ఉన్నట్టు వెల్లడించింది. అంతేకాదు, చనిపోయినవారిలో జైషే చీఫ్ మసూద్ అజర్ బంధువులు కూడా ఉన్నారు. హతమైన ఉగ్రవాదుల్లో ముంబై 26/11 దాడుల నిందితుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
కీలక ఉగ్రనేతల హతం..
