బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటే..

poguleti-12.jpg

ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తాము చేపట్టిన కార్యక్రమాల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తావిస్తూ, బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకటే. ఒకరు స్క్రిప్ట్ రాస్తే మరొకరు మాట్లాడతారు అని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షం పాత్ర పోషించడంలో తప్పులేదు. కానీ విమర్శలు చేస్తే వాటికి సోయి ఉండాలి. ప్రజలు అన్నం తినలేదన్నట్టు బిల్డప్ ఇవ్వడం తప్ప మరొకటి కాదు అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మంత్రి సీతారామ ప్రాజెక్టుకు కరెంట్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉండే ప్రభుత్వం ప్రజల అవసరాలపై ఎంత చిత్తశుద్ధితో పని చేసిందో చెప్పకనే చెప్పింది అని అన్నారు. భూమికి బదులుగా భూమి ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని, కానీ తాత్కాలికంగా నగదు రూపంలో సాయం అందిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. రెండు మూడు రోజుల్లో అందరికీ సాయం అందుతుంది. స్థలాలు పోతున్న వారికి పరిహారం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Share this post

scroll to top