ప్రజెంట్ టాలీవుడ్ లో నాని టైమ్ నడుస్తున్నది. హీరోగా వరుస బ్లాక్‌బస్టర్స్‌తో సత్తాచాటుతూనే మరోవైపు బారీ చిత్రాలు లైన్ లో పెడుతున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే ‘కోర్ట్’, ‘హిట్-3’ సినిమాలతో నిర్మాతగా విజయాలను అందుకోగా. చిన్న సినిమాగా వచ్చిన ‘కోర్ట్’ పెద్ద విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ ‘కోర్ట్’ మూవీ దర్శకుడు రామ్ జగదీష్‌తో నాని తన ప్రొడక్షన్‌లో మరో సినిమాని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నాడని సమాచారం.
తెలుగులో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో మెప్పించి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం పవన్ సాదినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార అనే ఇంట్రస్టింగ్ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత రామ్ జగదీష్ సినిమా చేసే అవకాశముందట. అంతేకాదు ఇప్పటికే కథా చర్చలు మొదలయ్యాయని, త్వరలోనే ప్రాజెక్ట్ లాక్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాగా నాని ప్రజంట్ మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో కూడా ఓ సినిమాని ప్రకటించాడు. ఇక ఇప్పుడు దుల్కర్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు. మున్ముందు ఇంకేన్ని ప్రాజెక్ట్ లు లైన్ లో పెడతాడో చూడాలి.