ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉందని చెబుతోంది వాతావరణ శాఖ దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, మన్యం, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, రెండు రోజుల్లో మధ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించబోతున్నాయి. మరోవైపు, రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనాల ప్రభావం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని గంటకు 40- 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.
భారీ వర్ష సూచన..
