అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి కొడతానంటే కొట్టమనండి కానీ, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశమైన జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి సర్కార్, అధికారులు, పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. కానీ, కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు. కేసులకు, జైళ్లకూ భయపడకూడదు అలా అయితేనే రాజకీయాలు చేయగలం చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయి అని ఫైర్ అయ్యారు.
చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీచేస్తున్నాడని దుయ్యబట్టారు వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. తిరువూరులో సంఖ్యాబలం లేని చోటకూడా టీడీపీ పోటీకి ప్రయత్నంచేస్తోంది. మెజార్టీ వైసీపీ ఉందంటే ఎన్నికను ఆపుతున్నారు. పోలీసులు. వైసీపీ వాళ్లని అరెస్టు చేస్తున్నారు. టీడీపీ వాళ్లని రోడ్డుపై విడిచిపెడుతున్నారు. కానీ, రేపు కచ్చితంగా వైసీపీకి కార్యకర్తే నంబర్ వన్ అని పేర్కొన్నారు. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి కొడతానంటే కొట్టమనండి కానీ, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి మనకూ టైం వస్తుంది. అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం రిటైర్డ్ అయిన వారిని కూడా లాక్కుని వస్తాం దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం అని హెచ్చరించారు.