అనసూయ ఇంట మరో శుభకార్యం.. 

anasuya-22.jpg

ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటోన్న అనసూయ సినిమాలతో బిజి బిజీగా ఉంటోంది. ఆ మధ్యన అల్లు అర్జున్ నటించిన పుష్ప2లో దాక్షాయణిగా మరోసారి మెరిసిందీ అందాల తార. తాజాగా అనసూయ ఇంట మరో శుభ కార్యం జరిగింది. ఇటీవలే నూతన గృహ ప్రవేశం చేసిన ఆమె తాజాగా తన పెద్ద కుమారుడికి ఉపనయనం కార్యక్రమాన్ని నిర్వహించింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తన కుమారుడు శౌర్య భరద్వాజ్‌కు సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకను నిర్వహించారు. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది అనసూయ. ఉపనయనం అంటే మన ఆధ్యాత్మిక పద్ధతులను పాటించండం, వైదిక సంప్రదాయంలో ప్రకారం ఉపనయన వేడుకలో శరీరంపై యజ్ఞోపవీతం ధరిస్తారు.

నా పెద్ద కొడుకు ప్రియమైన శౌర్య భరద్వాజ్ నీకు ఈ వేడుక అవసరం లేదని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈరోజు నీ ఉపనయనం వేడుకతో నీ అమ్మానాన్నలుగా, కుటుంబంగా మేమంతా కలిసి ఆధ్యాత్మిక పునర్జన్మలోకి అడుగుపెట్టామని పిస్తోంది. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలు, జ్ఞానం భవిష్యత్ తరాలకు అందించేలా మన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించేలా వాగ్దానాన్ని తీసుకున్నాం. నువ్వు మన సంస్కృతి సంప్రదాయాలను సజీవంగా ఉంచడానికి మాకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం. ఆ హనుమాన్ జీ శక్తి నిన్ను ఎల్లప్పుడూ నీతి మార్గంలో నడిపిస్తుంది’ అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది అనసూయ.

Share this post

scroll to top