మూడేళ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్య..

kill-23-.jpg

రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మహిళలపై, బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కామంధులు రెచ్చిపోతున్నారు. ఓ ఘటన మరో ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అభం, శుభం తెలియని చిన్నారి పై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై హత్య చేసి మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేశాడు. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లా మైలవరం మండలం ఎ.కంబాలదిన్నెలో చోటుచేసుకుంది. అయితే నిందితుడిని తమకు అప్పగించాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share this post

scroll to top