తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ పుట్టిస్తున్న  కరోనా పాజిటివ్‌ కేసులు..

covid-24.jpg

మళ్లీ క్వారంటైన్‌ తప్పదా? దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా పాజిటివ్‌ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే దేశ రాజధాని ఢిల్లీలో 23 కేసులు నమోదు కాగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. నమోదవుతున్న కేసులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ప్రపంచాన్ని షేక్‌ చేసిన మాయదారి కరోనా మళ్లీ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 260 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోవిడ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. తెలంగాణలో తాజాగా తొలి కొవిడ్‌ కేసు నమోదైంది. కూకట్ పల్లి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడుకి కరోనా పాజిటివ్‌ అని తేలింది. వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

వైద్యు డు ఆదివారం నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయనకు RTPCR‌ పరీక్ష చేయించుకోగా కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. రాష్ట్రంలోనూ తొలి కేసు నమోదవ్వడంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కొవిడ్‌ బాధితుల కోసం గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే 25 పడకల వార్డును సిద్ధం చేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా కొంతమందిలో లక్షణాలు కనిపిస్తున్నాయని గాంధీ ఆసుపత్రి డా.సునీల్‌ చెబుతున్నారు. ఎవరికైనా సింటమ్స్ కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలోని విశాఖలో ఓ మహిళకు కరోనా పాజిటవ్‌గా నిర్దారణైంది. ఆమె కుటుంబం వుంటోన్న పరిసరాల్లో శానిటైజేషన్‌చేశారు. మరోవైపు కడప రిమ్స్‌లో 70 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌ అని సూపరింటెండెంట్‌ ప్రకటించారు. 

Share this post

scroll to top