నల్ల క్యారెట్‌ తింటే ఇన్ని లాభాలా..

black-carroet-27.jpg

సాధారణంగా మార్కెట్లో ఎర్ర క్యారెట్‌ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా నల్ల క్యారెట్లను తిన్నారా? అవును, క్యారెట్‌లో నల్లపు రంగులో కూడా ఉంటాయి. పైగాఆ, ఇది ఎరుపు కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎర్ర క్యారెట్‌లో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

అన్ని రకాల క్యారెట్లు పోషకమైనవి. ప్రయోజనకరమైనవి. కానీ నల్ల క్యారెట్లలో ఉండే ఆంథోసైనిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఆరోగ్యానికి ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు. ఎర్ర క్యారెట్‌లో విటమిన్ ఎ, విటమిన్ కె1, విటమిన్ బి6, బయోటిన్, ఫైబర్, ప్రోటీన్, అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు కనిపిస్తాయి. నల్ల క్యారెట్లలో విటమిన్లు ఎ, సి పుష్కలంగా ఉంటాయి. నల్ల క్యారెట్లు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులో ఆంథోసైనిన్ సమ్మేళనం ఉంటుంది. ఇది అనేక కంటి వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతుంది.

నల్ల క్యారెట్లు తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిలో కేలరీల కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. నల్ల క్యారెట్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. నల్ల క్యారెట్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. నల్ల క్యారెట్‌ తినటం వల్ల కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో, వాటిని దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది. తద్వారా వృద్ధాప్య సంకేతాలను దైరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Share this post

scroll to top