పల్నాడు నూతన కలెక్టర్ గా శ్రీకేశ్ బాలాజీ లట్కర్ నియామకం

palnadu-a-.jpg

పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో, పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్ ను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాకు శ్రీకేశ్ బాలాజీ లట్కర్ ను కలెక్టర్ గా నియమిస్తున్నట్టు పేర్కొంది. ఈసీ ఈ సాయంత్రం లోగా తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాలకు కొత్త ఎస్పీలను కూడా ప్రకటించనుంది. సీఎస్ పంపిన పేర్లను పరిశీలిస్తున్న ఈసీ కాసేపట్లో ఉత్తర్వులు వెలువరించనుంది.

Share this post

scroll to top