ఎన్నికల నేపథ్యంలో దాడులు, హింసాత్మక ఘటనలతో పల్నాడులో రావణకాష్టం రగిలిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఎన్నికలు ముగిసిన తరువాత కూడా దాడులు, ఘర్షణలతో జిల్లాలోని పలునియోజకవర్గాలు దద్దరిల్లాయి. ఈ నేపథ్యంలో పల్నాడులో 144 సెక్షన్ సైతం అమలైంది. కాగా ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి నియంత్రనలోకి వచ్చింది.
కాగా న్నికల నేపథ్యంలో జరిగిన ఘటనలపై విచారణ చేసే బాధ్యతను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. కాగా సిట్ విచారణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వందల కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది వైసీపీ నేతలను, 8 మంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా దాడులు, ఘర్షణలకు సంబంధించిన వీడియోలను చూసి పోలీసులు నిందితులను గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురజాల నియోజకవర్గంలో 100 కేసులు నమోదుకాగా.. ఎఫ్ఐఆర్‌లో 192 మంది పేర్లు ఉన్నాయి. అలానే దాచేపల్లి మండలంలో 70 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిడుగురాళ్ల మండలంలో 67 మందిపై ఐపీసీ సెక్షన్ 307,324,323 కింద కేసు నమోదైంది.