మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్ట్ అయినట్లు సమాచారం. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌజ్‌లో ఎమ్మెల్యేను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన ఇష్యూలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే,ఈవీఎం ధ్వంసం చేయకముందు అసలు ఏమి జరిగింది.? అసలు ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లో టీడీపీ కార్యకర్తలు ఏం చేశారు.? అది ఇప్పుడు చూద్దాం..!
ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లో టీడీపీ రిగ్గింగ్ కి పాల్పడినట్లు సమాచారం. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి వారిని ప్రశ్నించగా వారు నోరు మెదపకపోవడంతో.. ఈవీఎం ధ్వంసం చేశారని వైసీపీ వెల్లడించింది. తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే అరెస్ట్‌పై పోలీసులు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.