మరోసారి ఉద్యమ పార్టీ లక్షణాలను పార్టీకి తీసుకొచ్చే దిశగా కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో పార్టీ గ్రామస్థాయిలో కూడా బలంగా ఉండేది. ప్రత్యేకంగా గ్రామస్థాయిలో పార్టీకి నాయకులంటూ లేకపోయినా ప్రజలే కార్యకర్తలుగా పని చేశారు. పార్టీ అనుబంధ సంఘాలు కూడా బలంగా పనిచేశాయి. ఉద్యమ సమయంలో ప్రతి రంగానికి ఒక అనుబంధ సంఘాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్. ఆటో యూనియన్ నుంచి సింగరేణి వరకు ప్రతి రంగానికి అనుబంధ సంఘం ఉంది. కానీ 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీతో సహా అనేక అనుబంధ సంఘాలు బలహీనపడ్డాయి. పార్టీకి అనుబంధంగా పనిచేసే టీచర్స్ యూనియన్ కూడా ఉనికి కోల్పోయింది. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పనిచేసిన పార్టీ విద్యార్థి అనుబంధ సంఘం టిఆర్ఎస్వి గత పదేళ్లుగా ఎక్కడా పెద్దగా కార్యక్రమాలు చేపట్టలేదు. యూత్ విభాగానికి అసలు నాయకత్వమే లేకుండా పోయింది.
బీఆర్ఎస్‌ను ట్రాక్‌లో పెట్టడంపై కేసీఆర్ ఫోకస్..
