డిగ్రీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని మంగళగిరికి చెందిన షేక్ రెహ్మాన్ కోరారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ డబ్ల్యూఆర్ స్కూల్, కాలేజీల్లో పనిచేస్తున్న పార్ట్ టైం సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని సిబ్బంది కోరారు. వైసీపీ ప్రభుత్వం తొలగించిన 1800 మంది బీమా మిత్రలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని ఏపీఏసీటీపీఎల్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని ఏపీఎన్ఎస్ కమిటీ విజ్ఞప్తి చేసింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆయా సమస్యలను పరిష్కరిస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారు.