రాష్ట్రంలోని పెన్షన్ దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటమే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.. అందరి మద్దతుతో అండగా నిలుస్తూ.. సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది.. ఏ ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు ఓట్లేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ, ప్రథమ కర్తవ్యం.. మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ను ఒకేసారి రూ. 1000 పెంచాం.. ఇకపై రూ.4000 ఇస్తామని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగులకు రూ.3000 పెంచాం.. ఇకపై వారికి రూ.6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది.. 28 వర్గాలకు చెందిన 65, 18, 496 మంది పెన్షన్ లబ్దిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ..
