ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ లో తీవ్ర విషాదాన్ని నింపిన తొక్కిసలాట ఘటనపై సత్సంగ్ నిర్వహించి 121 మంది మృతికి కారణమైన భోలేబాబా తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. తొక్కిసలాట తర్వాత పరారీలో ఉన్న అతను ఈ ఘటన తనను తీవ్రంగా బాధపెట్టిందని చెప్పాడు. “ఘటన మిగిల్చిన విషాదాన్ని భరించే శక్తి దేవుడు మాకు ప్రసాదించాలి. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచండి. కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం నాకుంది. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి జీవితాంతం అండగా నిలబడాలని, వారికి సాయం చేయాలని నా న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా కమిటీ సభ్యులను అభ్యర్థించాను” అని మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
బాబా..హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే తొలిసారి మీడియా ముందుకు భోలే బాబా..
