ఇదుగో మిమ్మల్నే చూసి టెమ్ట్‌ అవ్వొద్దు! క్యాన్సర్ వస్తుందట జాగ్రత్త మరి

food-08.jpg

నేటి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. వివిధ కారణాల వల్ల శరీరంలోని వివిధ భాగాలలో క్యాన్సర్ తిష్టవేస్తుంది. అనేక ఆహారాలలో క్యాన్సర్ కారకాలు కూడా ఉంటాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఆ ఆహారాలు ఎంత తక్కువగా తీసుకుంటే, ఆరోగ్యానికి అంత మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. క్యాన్డ్ ఫుడ్ క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఇటువంటి ఆహారాలలో బిస్ ఫినాల్-ఎ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆహారాలను అధిక రోజులు నిల్వ ఉంచడానికి వినియోగిస్తారట. కార్బోనేటేడ్ పానీయాలు కూడా క్యాన్సర్‌కు కారణమవుతాయి. అంటే కోల్డ్‌డింక్‌లు, పండ్ల రసాలు లాంటి పానీయాలు అస్సలు ఆరోగ్యకరమైనవి మంచివి కావు. మైక్రోవేవ్ పాప్‌కార్న్‌ను క్యాన్సర్ కారకంగా కూడా పరిగణిస్తారు. ఇది హానికరమైన PFOA అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. అలాగే శుద్ధి చేసిన చక్కెర కూడా చాలా హానికరం. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. ప్రాసెస్ చేసిన మాంసం క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇందులో కలిపిన ప్రిజర్వేటివ్స్ శరీరానికి హానికరం. అలాగే సోడియం అధికంగా ఉండే ఆమ్ల ఆహారాలు కూడా క్యాన్సర్‌కు దారితీస్తాయి. ముఖ్యంగా కడుపు క్యాన్సర్ వీటి వల్ల వస్తుంది. అందుకే నిల్వ పచ్చళ్లకు దూరంగా ఉండాలి.

Share this post

scroll to top