పులివెందులలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. అర్థరాత్రి వైఎస్సార్ కాలనీలో దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త అబ్దుల్ ఇంట్లోకి చొరబడి టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. అబ్ధుల్ ఇంట్లో వస్తువులు, బైక్ ధ్వంసం చేశారు. అడ్డుకున్న అబ్దుల్ మామను తలపై కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నామనే దాడి చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆగని అరాచకం.. పులివెందులలో ‘పచ్చ’మూకల బరితెగింపు
