కర్ణాటక ఐటీ మంత్రి లోకేష్‌కి కౌంటర్..

lokesh-18.jpg

నాస్కామ్‌ను ఏపీకి ఆహ్వానించిన ఐటీ మంత్రి నారా లోకేష్‌కు కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. ‘‘డియర్ లోకేష్..మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన ప్రతి సంస్థలోనూ ఏపీకే చెందిన సమర్థులకు, నిపుణులకు ఉద్యోగాలు రావాలని కోరుకోరా?’’ అని ప్రశ్నించారు. నాస్కామ్ కర్ణాటక లోనే నిశ్చితంగా ఉండొచ్చని, వారికి ఇబ్బంది కలిగేలా తమ ప్రభుత్వం ఏ పనీ చేయదని హామీ ఇచ్చారు. ఏపీలో ఇటీవల ఐటీ మంత్రి నారా లోకేష్ నాస్కామ్‌కు స్వాగతం పలికేందుకు ఏపీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. నాస్కామ్‌ నిరాశను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుందని వెల్లడించారు. ఏపీలో ఐటీ సేవలు, ఏఐ, డేటా సెంటర్‌ క్లస్టర్‌ విస్తరణకు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐటీ సేవలు విస్తరించుకోవచ్చని లోకేష్‌ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Share this post

scroll to top