ఘోరంగా హింసకాండ చేయమని ప్రజలు టీడీపీని ఎన్నుకున్నారా?

cbn-20-2.jpg

చంద్రబాబు పాలన  ఇలా హీనంగా సాగడం వల్ల ఏమి ప్రయోజనం దక్కుతుందో తెలియదు. ఈ  ఘటనలతోనే ప్రతిపక్షం లేకుండా పోతుందని భావిస్తే అది భ్రమే అవుతుంది. త ప్రభుత్వంలో జరిగాయి కనుక ఇప్పుడు ఇంత ఎక్కువ హింస జరుగుతోందని టీడీపీ, లేదా ఎల్లో మీడియా వాదించవచ్చు. అది కరెక్టా? కాదా? అన్నది పక్కనబెడితే , ఒకవేళ అది నిజమే అనుకున్నా, అంతకంటే ఘోరంగా హింసకాండ చేయమని ప్రజలు టీడీపీని ఎన్నుకున్నారా? తమ  ప్రభుత్వం వచ్చింది ప్రత్యర్ధులపై కక్ష రాజకీయాలకు పాల్పడడానికే అని బహిరంగంగా చెప్పి చేయడమే మిగిలింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చిన రీతిలో అరాచకంగా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌, తదితర టీడీపీ, జనసేన నేతలు అదే అరాచకాన్ని నిజం చేసి చూపుతున్నారు. వారికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా మద్దతు  ఇస్తున్న పద్దతి నీచాతినీచంగా ఉంది. చివరికి హత్యలు చేసినవారిని, దాడులు చేసి వాహనాలను నాశనం చేసినవారిని సైతం ఈ మీడియా సంస్థలు వెనుకేసుకు వస్తూ జర్నలిజం స్థాయిని పాతాళానికి తీసుకువెళ్లాయి. అందుకు ఆ మీడియా యజమానులు ఏ మాత్రం సిగ్గుపడడకపోవడం విషాదం.

Share this post