కాంగ్రెస్ ప్రభుత్వం బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు రూ.వేల కోట్లు అప్పులు తెచ్చే కుట్రకు తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిపైనా విమర్శలు చేశారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావడం వల్ల రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడుబోతోందని అన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్, కాంగ్రెస్ 6 గ్యారంటీలు కలిపి గాడిద గుడ్డు.. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు = గాడిద గుడ్డే అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర పన్నుతున్నారని.. నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.
బండి సంజయ్ సంచలన ఆరోపణలు..
