భారీ వర్షాల ఎఫెక్ట్.. 

rain-20.jpg

హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కుండపోతగా కురుస్తోంది. దీంతో రోడ్లపైకి, ఇళ్ల మధ్యలోకి భారీగా వరదనీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మంగళవారం ఉదయం ఆఫీసులకు వెళ్లే వాహనదారులకు, స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండ్రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయడంతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. జలమండలి జీఎం, డీజీఎం, మేనేజర్లు అత్యవసరంగా జూమ్ సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఈ సందర్భంగా వారు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై దృష్టి పెట్టాలని ఆదేశాలు ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వర్షాల వల్ల ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 155313 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నందున ఉద్యోగులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Share this post

scroll to top