చిరంజీవి చెల్లెలిగా తెలుగు హీరోయిన్..

mega-star-20.jpg

మెగాస్టార్ చిరంజీవి మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ చాలా రోజుల క్రితమే మొదలైంది. ఇందులో భాగంగానే పలు షెడ్యూళ్లను ప్లాన్ చేసి క్రేజీ సీన్స్‌ను షూట్ చేశారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ త్రిషపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తీశారు. ఇలా మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయనున్నారు. టెక్నికల్ వండర్‌ గా రాబోతున్న ‘విశ్వంభర’ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు అమ్మాయి అయిన రమ్య పసుపులేటిని తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. రమ్య పసుపులేటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘విశ్వంభరలో చిరంజీవి గారి పక్కన సిస్టర్‌గా చేస్తున్నాను. ఆయనతో చాలా సేపు కనిపిస్తాను. నాకు చాలా సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి కానీ హీరోయిన్‌గా చేద్దామనే అవేవి ఒప్పుకోలేదు. ఇప్పుడు చిరంజీవి గారి పక్కన ఛాన్స్ అని మాత్రమే చెల్లి పాత్రకు ఒప్పుకున్నాను’ అని చెప్పుకొచ్చింది.

Share this post

scroll to top