తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై కసరత్తు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం జరగనుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇంత వరకు పీసీసీ పదవిని ఎస్టీలకు ఇవ్వలేదనే వాదనపై కూడా సమావేశంలోజరగనున్న చర్చ జరగనుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు నియామకంపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఈరోజు తుది నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే.. కొత్త అధ్యక్షుడు నియామకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది.
నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం..
