సిటీ బస్సులో మహిళకు ప్రసవం చేసిన లేడీ కండక్టర్.. సజ్జనార్ ట్వీట్..

pregnats-05.jpg

హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ లేడీ కండక్టర్ మాతృత్వాన్ని చాటుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ముషీరాబాద్ డిపో కండక్టర్ సరోజ ప్రసవం చేసిన ఘటన హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో చోటుచేసుకుంది. దీనిపై ఆర్టీసీఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఆరంఘర్ నుంచి సర్వీస్ నంబర్ 81/1 రూట్ నంబర్ 1Z బస్ లో సికింద్రాబాద్ వస్తుండగా ఒక్కసారిగా ఒక మహిళ ప్రయాణికురాలకి పురిటి నొప్పులు రావడం ప్రారంభమయ్యాయి. అయితే అందులో ప్రయాణికులు కండెక్టర్‌ కు తెలుపగా.. లేడీ కండెక్టర్‌, డ్రైవర్ ను బస్సును పక్కకు ఆపాలని సూచించారు. వెంటనే డ్రైవర్ బస్సులు పక్కకు ఆపు పాసింజర్స్ కిందకు దింపేశారు. తోటి ప్రయాణికుల సహాయంతో బస్ కండక్టర్ సరోజ డెలివరీ చేశారు. ఇవాళ ఉదయం 7 గంటల 30 నిమిషాలకు పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది ఆ మహిళ. వెంటనే అదే బస్సులో తల్లి బిడ్డలను క్షేమంగా గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద అడ్మిట్ చేశారు.

Share this post

scroll to top