నిన్న అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం అంతా కసరత్తు చేసి వచ్చే సంవత్సరం నుండి అమ్మఒడి ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలను పదే పదే మోసం చేసే ప్రభుత్వాలు ఎల్లకాలం మనుగడ సాధించలేవు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడం టీడీపీ షరా మామూలే కాకపోతే మోసపోయిన ప్రజలు ఆలస్యంగా తెలుసుకుంటున్నారు. హామీలపై కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఒకలా ఎన్నికల తర్వాత మరోలా మాట్లాతున్నారు. తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఆర్థికసాయం చేస్తామన్న కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరిట పిల్లలకు పంగనామాలు పెట్టారంటూ జనాలు ఎద్దేవా చేస్తున్నారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు రంగులు మార్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, మహిళలను, ముఖ్యంగా తల్లులను మోసం చేస్తూ రాజకీయం చేసే నీచాతినీచమైన రాజకీయ నాయకుడు ఎవరు ఉండరు. కళ్ళ ముందే ఇంత జరుగుతుంటే ప్రశ్నించడానికే పార్టీ పెట్టా అన్న పవన్ కళ్యాన్ ఇప్పుడు ప్రశ్నించకుండా ఎక్కడ ఉన్నాడు?
అమ్మకి వందనం పథకం కి పంగనామాలు..
