ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వం చేసిన చర్చలు విఫలం కావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసింది. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని విధంగా ఈ బుధవారం ఉదయం ఆరోగ్యశ్రీకి రూ. 203 కోట్ల నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. కాగా ఈ నిధులను అత్యవసరంగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే గతంలో పెండింగ్ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో దిగొచ్చిన సర్కార్ నిధులు విడుదల చేసినట్లు తెలుస్తుంది. గతంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందించిన ఆరోగ్య శ్రీ సేవలకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదని మండి పడ్డారు.
నేటి నుంచి యదావిదిగా ఆరోగ్య శ్రీ సేవలు..
