ఆస్పత్రిలో ఉపేంద్ర అభిమానుల్లో ఆందోళన.. 

upndra-06.jpg

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అభిమానులు సోమవారం ఒక్క క్షణం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉపేంద్ర ఆరోగ్యం క్షీణించిందని వార్తలు రావడంతో కంగారు పడ్డారు. దీనికి తోడు ఉప్పీ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. దీంతో అభిమానులు బాగా టెన్షన్ పడ్డారు. అయితే కొద్ది గంటల్లోనే ఉప్పీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇది విన్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఉపేంద్ర గత కొన్ని రోజులుగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాడని తెలుస్తోంది. ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ‘UI’ సినిమా షూటింగ్ సమయంలోనూ ఉపేంద్ర ఇదే సమస్యను ఎదుర్కొన్నాడు. ‘బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఉపేంద్ర ఇంటికి తిరిగి వచ్చాడు. అతని ఆరోగ్యం మెరుగుపడింది కాబట్టి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఉప్పీ సన్నిహితులు తెలిపారు.

ఇక కొద్ది సేపటికే ఉపేంద్ర కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ‘అందరికీ నమస్కారం నేను ఆరోగ్యంగా ఉన్నాను రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం మాత్ర‌మే నేను ఆసుపత్రికి వెళ్లాను. అంతే త‌ప్ప‌ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు విని అభిమానులు ఏ మాత్రం ఆందోళన చెంద‌వ‌ద్దు. మీ ప్రేమ‌, అభిమానానికి నా ధ‌న్య‌వాదాలు’ అని ఉపేంద్ర ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు కూల్ అయ్యారు.

Share this post

scroll to top