ఒక్క సినిమాతో మారిన క్రేజ్.. 

kayadhu-10.jpg

ప్రస్తుతం సినీరంగంలో ఎక్కువగా మారుమోగుతున్న పేరు కయాదు లోహర్. ఏడేళ్లుగా కన్నడ చిత్రపరిశ్రమలో వరుస సినిమాలతో అలరిస్తుంది. కానీ మొదటి నుంచి సరైన బ్రేక్ ఎదురుచూస్తుంది. గతేడాది మాత్రం తన పోరాటానికి ఫలితం దక్కింది. తమిళంలో ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించిన డ్రాగన్ సినిమా ఈ బ్యూటీకి కెరీర్ మలుపు తిప్పింది. ఈ సినిమాతో కయాదు లోహార్ సెన్సేషన్ అయ్యింది.ఈ మూవీ అంత పెద్ద హిట్టు అవుతుందని తనకు ఈ రేజ్ క్రేజ్ వస్తుందని ఊహించి ఉండదు. ప్రస్తుతం నాని నటిస్తోన్న ది ప్యారడైజ్ చిత్రంలో కయదు లోహర్ కథానాయికగా నటిస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

అలాగే కోలీవుడ్ హీరో అధర్వ సరసన ఓ సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళ్ హీరో శింబు సరసన ఆయన 49వ చిత్రంలో నటించేందుకు రెడీ అయ్యింది కయదు లోహర్. అంతేకాకుండా సంగీత దర్శకుడు, జీవీ ప్రకాష్ కుమార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళంలోనూ జోరు కొనసాగిస్తుంది కయదు లోహర్. తర్వలోనే ఈ బ్యూటీని వరించిన సినిమా ఆఫర్స్ పై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అటు నెట్టింట వరుస ఫోటోషూట్స్ చేస్తుంది.

Share this post

scroll to top