టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే జోరు తగ్గింది. ఒకానొక టైం లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఏలిన పూజా హెగ్డే ఆతర్వాత ఐరెన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్స్ గా నిలిచాయి. నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అల్లు అర్జున్ డీజే సినిమాతో గ్లామర్ గేట్స్ ఎత్తేసింది. ఈ సినిమాలో ఏకంగా బికినిలో కనిపించి మెప్పించింది. ఆతర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది పూజా హెగ్డే దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ కావాలని చూస్తుంది. ఈ క్రమంలోనే దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీలో ఛాన్స్ అందుకుంది. గతంలో విజయ్ తో కలిసి బీస్ట్ సినిమా చేసింది పూజా.. ఇప్పుడు మరోసారి విజయ్ తో నటిస్తుంది. మరి ఈ సినిమా పూజాకు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి. అలాగే బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో దేవా సినిమాలో నటించింది. ఈ సినిమా నేడు విడుదలైంది. ఇదిలా ఉంటే తాజాగా తాను ప్రేమలో పడ్డాను అంటూ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా పూజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వరుసగా సినిమాలు రావడం ఆనందంగా ఉందని తెలిపింది. అలాగే నా లైఫ్ లో అప్స్ అండ్ డౌన్ ఉన్నాయి. ఒకప్పుడు ఒక మూవీ అయిపోగానే నెక్ట్స్ సినిమా కోసం ఎదురుచూసేదాన్ని నేను సినిమాలతో ప్రేమలో పడ్డానా? నాకు ఇప్పటికీ అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.