శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్..

aravind-05.jpg

పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర గాయపడిన బాలుడు శ్రీ తేజ్ ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. ఇటీవల కిమ్స్ ఆస్పత్రి నుంచి బాలుడు శ్రీ తేజ్ డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అతని శరీరంలో కదలికలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫిజియోథెరపీ హాస్పిటల్ కు శ్రీ తేజ్ ను తరలించారు. పంజాగుట్ట లోని ఓ ప్రముఖ ఫిజియోథెరపీ సెంటర్ కు శ్రీ తేజ్ ను తరలించినట్లు తెలుస్తోంది.

15 రోజులపాటు ఫిజియోథెరపీ అప్లై చేస్తే శ్రీ తేజ్ కోరుకుంటాడని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆసుపత్రిలో ఉన్న బాలుడు శ్రీ తేజ్ ను పరామర్శించారు అల్లు అరవింద్, బన్నీ వాసు. ఈ సందర్భంగా శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ మెరుగైన చికిత్స అందించాలని ఈ సందర్భంగా అల్లు అరవింద్ పేర్కొన్నారు. కాగా సంధ్య థియేటర్ ఘటనలో శ్రీ తేజ్ తల్లి రేవతి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. అప్పటినుంచి శ్రీ తేజ్ వైద్యం ఖర్చులు మొత్తం అల్లు అర్జున్ భరిస్తున్నాడని తెలుస్తోంది.

Share this post

scroll to top