ఆంధ్ర ప్రదేశ్ కూటమి సర్కార్ పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ రాజ్యాన్ని రావణకాష్టంగా మార్చారని చంద్రబాబు కూటమి సర్కార్ ను ఉద్దేశించి శ్యామల వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో పసిబిడ్డలకి కూడా రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలపై ఇంతలా అఘాయిత్యాలు జరుగుతున్నా నోరుమెదపరేంటి ? అని ప్రశ్నించారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. ఓట్ల కోసం గ్యారంటీలతో జనాన్ని బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ తెలుగు దేశం పార్టీ కూటమి పాలనలో పసిబిడ్డలకి కూడా రక్షణ కరువైందని రామ రాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చేశారు. ఆడబిడ్డలపై ఇంతలా అత్యాచారాలు జరుగుతున్నా నోరుమెదపరేంటి? ఆగ్రహించారు.
ఆంధ్ర రాష్ట్రంలో పసిబిడ్డలకి కూడా రక్షణ కరువైంది..
