నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి మధ్య వర్గపోరు భగ్గుమంటోంది. సాధారణ ఎన్నికల నుంచి వీరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. రెండు వర్గాల మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నా గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీ టికెట్ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరికి, నందికొట్కూరు అసెంబ్లీ టికెట్ మాండ్ర శివానందరెడ్డి వర్గానికి చెందిన జయసూర్యకు దక్కాయి. రెండు వర్గాలు టీడీపీలో ఉన్నా ఒకరినొకరు సహకరించుకున్న పరిస్థితి లేదు. ఎవరి ప్రచారం వారే చేసుకున్నారు. ప్రత్యర్థుల్లానే వ్యవహరించారు. ఎన్నికల ఫలితాల అనంతరం అదే ధోరణి వ్యవహరిస్తుండటంతో వ్యవహారం తారా స్థాయి చేరుకుంటుంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రెండు వర్గాల మధ్య రగడకు దారి తీశాయి. మాండ్ర వర్గం బైరెడ్డి ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో చంద్రబాబు సమక్షంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
బైరెడ్డి జోక్యాన్ని సహించేది లేదంటున్న ఎమ్మెల్యే జయసూర్య..
