వాలంటీర్లకు తీపి కబురు..

cbn-31-.jpg

గత కొంతకాలంగా ఏపీ వాలంటీర్ల వ్యవస్థపై జనాల్లో జోరుగా చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ గద్దె దిగి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం కావడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. వాలంటీర్ల అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా?.. లేదా? అనే అంశం తెరపైకి వచ్చి రకరకాల డిస్కషన్స్ నడిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. కొంతకాలంగా కొనసాగుతున్న కన్ఫ్యూజన్‌కు తెరపడింది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు తీపి కబురు చెప్పారు. వాలంటీర్లను అలాగే కొనసాగిస్తామని, రాష్ట్రంలో వారి సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు అందరూ కూడా వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకోవాలని.. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

Share this post

scroll to top