ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజగా ఢిల్లీకి వెళ్ళ్లారు. నిన్నటి రోజున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత వెలగపూడి సచివాలయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి పయనం అయ్యారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి నిన్న 3:30 గంటలకు విమానంలో వెళ్లి 5:45 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
విమానాశ్రయం నుంచి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రిఅమిత్ షా నివాసానికి వెళ్లి నిన్న సాయంత్ర 6:30 నుంచి 7:00 వరకు ఆయనతో సమావేశం అయ్యారు ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు అధికారుల తీరుపై తీవ్ర ఆపేక్షణ వ్యక్తం చేస్తూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేవలం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మాత్రమే కలిసేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఢిల్లీలో అమిత్ షా వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు.