నేడు శ్రీవారిని దర్శించుకోనున్న పవన్ కల్యాణ్..

pavan-kalyan-02.jpg

నేడు తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు. ఇక తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ప్రాయశ్చిత దీక్షను విరమించునున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. దర్శనానంతరం నేరుగా తరిగొండ అన్నప్రసాద సముదాయానికి చేరుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అన్న ప్రసాదాల తయారీని పరిశీలించనున్న డిప్యూటీ సీఎం అన్నప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రాత్రి తిరుమలలో బస చేశారు పవన్ కల్యాణ్. కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్యతో కలిసి వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. ఇవాళ తిరుమలలోనే బస చేయనున్నారు పవన్ కల్యాణ్‌. రేపు తిరుపతి వారాహి సభలో పాల్గొంటారు.

Share this post

scroll to top