మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి నుంచి మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించనున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీని సంక్రాంతి నుంచి మొదలు పెట్టనున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సుల కొరత లేకుండా ఉండేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు కూడా ఇబ్బంది కలగకుండా ఫ్రీ బస్సు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఆటో డ్రైవర్లను దృష్టిలో ఉంచుకుని విధానాలను రూపొందిస్తామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు.
ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ ఫ్రీ బస్సుకు డేట్ ఫిక్స్..
