గత ప్రభుత్వ హయాంలో చెలరేగిన వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ డెడ్ లైన్ విధించింది. ఊరు వదిలిపెట్టి పోవాలని తమదైన శైలిలో హెచ్చరించింది. పెళ్లాం, పిల్లలతో.. పెట్టె బెడ సర్దుకొని వెళ్లాలని హుకుం జారీచేసింది. లేదంటే వదిలిపెట్టబోమని తేల్చి చెప్పింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో కొడాలి నాని రెచ్చిపోయారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ప్రభుత్వం మారడంతో కొడాలి నాని తదితరులకు గడువు ఇచ్చింది. ఆ గడువు దాటడంతో టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు.
కొడాలి నాని ఊరు వదిలి పో.. లేదంటే..!!
