త్వరలో పెరగనున్న మద్యం ధరలు..

liqur-07.jpg

ఏపీలో మద్యం ధరలు పెరగనున్నాయి. వీటి ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్న వారికి ఇది బిగ్ షాక్ అని చెప్పవచ్చు. మద్యం దుకాణదారులకు చెల్లిస్తున్న మార్జిన్ సరిపోవడం లేదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం ధరలు పెంచడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం చెల్లిస్తున్న కమిషన్‌ను 14.5 శాతానికి పెంచాలని భావిస్తోంది. ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటు వల్ల ఇప్పటికే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది.

గతేడాది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు తెలిపింది. ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని ఇచ్చే మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని భావించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొత్త పాలసీలో ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుకు మొగ్గు చూపింది. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఏపీలో 3వేలకు పైగా ప్రైవేట్ మద్యం దుకాణాలు ఏర్పాటు అయినట్లు తెలుస్తోంది. 

Share this post

scroll to top