వర్షం గండం మళ్లీ తప్పేట్లు లేదు..

rain-22.jpg

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వర్షం గండం మళ్లీ తప్పేట్లు లేదు. మరోసారి రాష్ట్రానికి వర్షసూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో చెదురుముదురు వర్షాలు కురుస్తున్నాయి. సీమ ప్రాంతంలో పిడుగులతో కూడిన వానలు పడుతున్నట్లుగా సమాచారం. మరో 3 రోజులు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వర్షాలు, వరదల నేపథ్యంలో పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించారు. సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, అజ్మీర్, గుణ, అల్పపీడన ప్రాంత కేంద్రం తూర్పు మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్, చంద్‌బాలీ, ఆగ్నేయ ప్రాంతాల మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళుతుంది. 

Share this post

scroll to top