ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో ఒక్కో లొసుగు బయటకు వస్తోంది. కూటమి పార్టీల మధ్య గొడవలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎపిసోడ్ తలనొప్పిగా మారింది. వారంలో ఏదో ఒక వివాదం కొలికపూడి శ్రీనివాస్ రావు చుట్టూ తిరుగుతోంది. తాజాగా కొలికపూడి శ్రీనివాసరావుపై మరో ఫిర్యాదు అందింది. కొలికపూడి నియోజకవర్గానికి చెందిన కొంతమంది జర్నలిస్టులు నారా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. కొలికపూడిపై ఆంధ్రజ్యోతి రిపోర్టర్ నెగిటివ్ వార్త రాయడంతో ఆయన బహిరంగంగానే రెచ్చిపోయారు. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ నా వెంట్రుక కూడా పీకలేడని అందిరి ముందే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తలుచుకుంటే ఒక్కడు కూడా నియోజకవర్గంలో తిరగలేడని వార్నింగ్ ఇచ్చారు. అయితే కొలికపూడి బహిరంగంగా జర్నలిస్టులను కించపరిచేలా మాట్లాడడంపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
తలనొప్పిగా మారిన శ్రీనివాసరావు ..
