ఏపీ డిప్యూటీ సీఎం, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఫారెస్ట్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అటవీ సంపద పరిరక్షణ కోసం ప్రత్యే రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పవన్ ఆదేశించారు. అలాగే మడ అడవుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అనుమతులు లేకుండా అడవులను ధ్వంసం చేసే వారిని ఉపేక్షించేది లేదని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అలాగే అడవుల సంరక్షణ పై చర్యలు తీసుకోవాలని.. ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం కాకుండా పక్కా ప్రణాళికలు రూపొందించాలని.. గ్రామాల్లో మరింత విస్తృతంగా ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
