రాజకీయ వేధింపులతో గుండె పోటుకు గురైన అంగన్‌వాడీ టీచర్ మణెమ్మ టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీలు, ఇతర స్కీమ్‌వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు పెరిగాయి రాజకీయ వేధింపులు ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ
పల్నాడు జిల్లా నాదెండ్ల సెక్టార్ పరిధిలోని గంగన్నపాలెం ఎస్‌సి కాలనీలోని అంగన్‌వాడీ టీచర్ మణిమ్మ విధుల్లో ఉండగా ఆమెను బలవంతంగా బయటకు తీసుకొచ్చి కేంద్రానికి తాళం వేయడం అధికార పార్టీ నాయకుల దురాగతానికి పరాకాష్ట టిడిపికి చెందిన నాయకుల తీరుతో గుండెపోటుకు గురై చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత అంగన్‌వాడీ టీచర్‌ను సుబ్బరావమ్మతోపాటు ఇతర నాయకులు మంగళవారం పరామర్శించారు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం మారెళ్లమూడి గ్రామంలో ఒక అంగన్వాడీ టీచర్ ను బలవంతంగా ఆమెచేతే రాజీనామా చేపించారు….. ఆవిడకు ఆరోగ్యము సరిగ్గా ఉండదు….అలాగే వచ్చి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది.గత 5 సంవత్సరాలలో ఎప్పుడు YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టలేదు..పోనీలే పాపం అనుకున్నారు…కానీ NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒత్తిడి తీసుకువచ్చి రాజీనామా చేపించారు.