ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. వరుస తుపానులు, వాయుగుండాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా నదులు, వాంగులువంకలు పొంగిపొర్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాల నుంచి తేరుకోకముందే మరోసారి ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. అయితే, అల్పపీడనం ఏర్పడిన తరువాత దీనిపై స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
బంగాళాఖాతంలో మరో వాయుగుండం..
