ఏపీకి మరో అల్పపీడనం..

havi-rain-5.jpg

గత వారం నుంచి కురుస్తున్న వానలకు అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ కి మరో ముప్పు ముంచుకొస్తోంది. మరోసారి వరుణుడు విజృభించనున్నాడని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలోతేలిక పాటి జల్లుల నుంచి మొదలయ్యి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఉత్తరాంధ్రలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా మూడు జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని అంటున్నారు. పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 7 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కాబట్టి అక్కడ ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.

Share this post

scroll to top