ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 100లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది. రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మరోవైపు సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే దీపావళి నాటికి మహిళలకు కానుక ఇవ్వాలనే అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఉచిత వంట గ్యాస్ అందిద్దామా లేక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిద్దామా అనే అంశంపై మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను ఇచ్చే పథకం వైపే మెజార్టీ మంత్రుల మొగ్గు చూపారట ఇక, బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు.
ఇక, వాలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ జరిగింది. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని తెలిపారు అధికారులు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వాలంటీర్లతో వైఎస్ జగన్ రాజీనామా చేయించాడని పలువురు మంత్రులు గుర్తుచేశారు. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.