ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం..

cbinate-3-.jpg

ఏపీ రాజధాని అమరావతిలో ఈ రోజు ఉదయం ప్రారంభం అయిన ఏపీ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఈ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోమ్ మంత్రి అనితతో పాటు ఇతర శాఖల మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇందులో జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై చర్చించారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం పై చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపింది.

అలాగే రాష్ట్రంలో గత ఐదేళ్లలో నిర్మాణం ప్రారంభం కాని గృహాల రద్దు చేసే అంశంపై చర్చించారు. సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వీటితో పాటుగా సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా పాటించాలని కేబినెట్‌లో నిర్ణయించింది. ఏపీ టెక్స్‌టైల్ గార్మెంట్, ఏపీ మారిటైమ్ పాలసీలకు ఆమోదం తెలిపారు. కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ప్రతిపాదనపై కేబినెట్‌లో సూదీర్ఘంగా చర్చించారు. కాకినాడ పోర్టు భద్రత సహా తదితర అంశాలపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చించారు.

Share this post

scroll to top