ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీకానుంది. ఇక, వివిధ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 21వ తేదీన సాయంత్రం 4 గంటల వరకు పంపించాలంటూ అన్ని శాఖల కార్యదర్శలకు లేఖ రాశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కాగా, 23వ తేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో కీలక చర్చలు సాగే అవకాశం ఉంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు.
సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కేబినెట్ సమావేశం చర్చించనుంది. దేవదాయ శాఖకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక, దీపావళి తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.