ఢిల్లీకి వెళ్లడంతోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు చంద్రబాబు. విభజన అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించారు. దాదాపు గంటపాటు అమిత్‌షాతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దిగజారిన వినాశకరమైన పరిస్థితిని కేంద్ర హోమంత్రి అమిత్ షాకు వివరించారు సీఎం చంద్రబాబు. దీనిపై విడుదల చేసిన నాలుగు శ్వేతపత్రాలపైనా అమిత్‌షాతో చర్చించినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చంద్రబాబు తెలిపారు. ఇవాళ ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలు, అభివృద్దికి కావల్సిన నిధులను సమకూర్చుకునేందుకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఙప్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అమిత్ షాకు వివరించా..
